మౌళిక వసతుల కల్పనకు పెద్ద పీట: PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబ‌ర్ 3 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): కొండాపూర్ డివిజన్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీ B బ్లాక్, రాజరాజేశ్వరి నగర్, ఓయూ కాలనీ, కొల్లా లక్జరియా విల్లాస్ నుండి హ్యుందాయ్ షో రూమ్ వరకు రూ. 2 కోట్ల 50 లక్షలతో నూతనంగా చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణం పనులకు, బీటీ రోడ్ల నిర్మాణం పనులకు కార్పొరేటర్ హమీద్ పటేల్ తో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ ప్రజల సంక్షేమం, శేరిలింగంపల్లి నియోజకవర్గం, కాలనీల అభివృద్దే ధ్యేయంగా ప్రజల సౌకర్యార్థం సీసీ రోడ్ల నిర్మాణం పనులకు, బిటి రోడ్ల నిర్మాణం పనులకు శంకుస్థాపన చేసుకోవడం జరిగింద‌ని తెలిపారు. సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం అని, కాలనీ వాసులకు ఉపశమనం లభించింది అని, మౌళిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తానని అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధికి గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూ. 1650 కోట్ల నిధులు మంజూరు చేయడం జరిగింద‌ని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్గదర్శకంలో మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో శేరిలింగంపల్లి నియోజకవర్గంను అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు, కాలనీల అసోసియేషన్ సభ్యులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here