మియాపూర్, అక్టోబర్ 2 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని మక్తా మహబూబ్ పేటలో గాంధీ విగ్రహం వద్ద మహాత్మ గాంధీ జయంతి సందర్భంగా కార్పొరేటర్లు ఉప్పలపాటి శ్రీకాంత్, రాగం నాగేందర్ యాదవ్, డీసీ మోహన్ రెడ్డిలతో కలిసి PAC చైర్మన్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ముఖ్య అతిథిగా పాల్గొని గాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం పారిశుధ్య కార్మికులను సత్కరించి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ నీలం రవీందర్ ముదిరాజ్, AMOH రవి కుమార్, SRP కనకరాజు, SRP మహేష్, నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.