నాలాను శుభ్రం చేసిన జీహెచ్ఎంసీ సిబ్బంది

శేరిలింగంప‌ల్లి, అక్టోబ‌ర్ 2 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ ఆదేశాల‌ మేరకు డివిజన్ పరిధిలోని ప్రేమ్ నగర్ ఎ బ్లాకులో 3వ నంబర్ వీధిలోని ఓపెన్ నాలాను శుభ్రం చేశారు. నాలాలో పేరుకుపోయిన మట్టి, రాళ్ళను, చెత్తను జీహెచ్ఏంసీ అధికారుల‌ సహకారంతో జేసీబీతో తొలగించారు. ఈ సందర్బంగా కార్పొరేటర్ హమీద్ పటేల్ మాట్లాడుతూ స్థానిక నాయకులు, ప్రజల‌ విజ్ఞప్తి మేరకు ప్రేమ్ నగర్ ఎ బ్లాకులోని ఓపెన్ నాలాను క్లియర్ చేయించడం జరుగుతుందని తెలియజేశారు.

శుభ్ర‌త ప‌నుల‌ను ప‌రిశీలిస్తున్న కార్పొరేటర్ హమీద్ పటేల్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here