ఘ‌నంగా కాంగ్రెస్ నేత‌ రేవ‌ల్ల రాజేష్ జ‌న్మ‌దిన వేడుకలు

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: కాంగ్రెస్ పార్టీ శేరిలింగంపల్లి డివిజన్ సీనియర్ నాయకులు రేవల్ల రాజేష్ జన్మదిన వేడుక‌లు బుధ‌వారం ఘ‌నంగా జ‌రిగాయి. చందాన‌గ‌ర్ జేవీఎన్ గార్డెన్స్‌లో జ‌రిగిన ఈ వేడుక‌ల్లో శేరిలింగంప‌ల్లి నియోజ‌కవ‌ర్గం సీనియ‌ర్ నాయ‌కులు జెరిపేటి జైపాల్‌, బ్లాక్ ప్రెసిడెంట్ ఇలీయాస్ ష‌రీఫ్‌లు ముఖ్య అతిథులుగా పాల్గొని రాజేష్‌ను ఘ‌నంగా స‌న్మానించి, కేక్ క‌ట్ చేయించి శుభాకాంక్ష‌లు తెలిపారు. రాజేష్ ఆయురారోగ్య ఐశ్వ‌ర్యాల‌తో నిండు నూరేళ్లు జీవించాల‌ని వారు ఆకాంక్షించారు. ఈ కార్య‌క్ర‌మంలో నాయ‌కులు పోశన్న, జాంగిర్, నజీముద్దీన్, ఘోరె తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here