నమస్తే శేరిలింగంపల్లి: హఫీజ్‌పేట్ డివిజన్ వార్డు మెంబర్, గంగారం గ్రామ ప్రముఖులు దొంతి శేఖర్ ముదిరాజ్ జన్మదిన వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. డివిజన్ టీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు రోహిత్ ముదిరాజ్, ఉపాధ్యక్షుడు శివ ముదిరాజ్, నాయకులు శ్రవణ్ ముదిరాజ్, భాను తదితరులు దొంతి శేఖర్ ముదిరాజ్‌ను ఘనంగా సత్కరించి, కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలియజేశారు. దొంతి శేఖర్ ముదిరాజ్ భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నట్టు రోహిత్ ముదిరాజ్ పేర్కొన్నారు.






