శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 17 (నమస్తే శేరిలింగంపల్లి): బిఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పుట్టిన రోజు సందర్బంగా శేరిలింగంపల్లి నియోజకవర్గం కొండాపూర్ ఏరియా ఆసుపత్రి లో పేషెంట్ లకు శేరిలింగంపల్లి సీనియర్ నాయకుడు, గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా పండ్లు పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా సాయిబాబా మాట్లాడుతూ తెలంగాణ జాతిపిత, తెలంగాణ బాపు కే సి ఆర్ పుట్టిన రోజు సందర్బంగా పండ్ల పంపిణీ చేయడం జరిగింది. ఆ భగవంతుడు కేసిఆర్ ని చల్లగా చూడాలని కోరుకుంటున్నానని తెలియజేశారు. ఈ కార్యక్రమం లో రాగం జంగయ్య యాదవ్, దారుగుపల్లి నరేష్, రాజు ముదిరాజ్, అశోక్ యాదవ్, రాగం శంకర్ యాదవ్, రమేష్ గౌడ్, నారాయణ, శామ్లెట్ శ్రీనివాస్, భిక్షపతి, పరమేష్, అజయ్ గౌడ్, అలీం, ఖాదర్ ఖాన్, సుగుణ, బాలమణి, సాయి, సుదర్శన్ పాల్గొన్నారు.






