ఉచిత నీటి పథకాన్ని సద్వినియోగం చేసుకోండి : ప్రభుత్వ విప్ ఆరెకపూడి‌ గాంధీ

నమస్తే‌ శేరిలింగంపల్లి: జీహెచ్ఎంసీ పరిధిలోని‌ గృహ అవసర వినియోగదారుల కోసం ప్రభుత్వం ‌ప్రతి నెల 20 వేల‌ లీటర్ల ఉచిత‌ నీటి పథకాన్ని ప్రవేశపెడుతుందని ఈ అవకాశాన్ని అర్హులైన ప్రతి ఇంటి యజమాని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ విప్,‌ శేరిలింగంపల్లి శాసన‌ సభ్యులు ఆరెకపూడి గాంధీ సూచించారు. మియాపూర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శనివారం కార్పొరేటర్లు రాగం నాగేందర్ యాదవ్, జగదీశ్వర్ గౌడ్, నార్నె శ్రీనివాసరావు, ఉప్పలపాటి శ్రీకాంత్, గంగాధర్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి, మంజులరఘునాథ్ రెడ్డి, రోజాదేవి రంగరావుతో పాటు‌ హెచ్ఎండబ్ల్యుఎస్ అండ్ ఎస్ బి హఫీజ్ పేట్ సెక్షన్, భాగ్యనగర్ సెక్షన్ జలమండలి అధికారులతో కలిసి ఎమ్మెల్యే ఆరెకపూడి‌ గాంధీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం ప్రతి నెల 20,000 వేల లీటర్ల ఉచిత నీటి పథకం కర పత్రిక ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ నగర వాసుల కోసం ప్రతిష్టాత్మకంగా ఈ పథకాన్ని తీసుకువచ్చారన్నారు. ఈ పథకం‌ వినియోగదారులకు చేరువయ్యేలా ప్రతి ఇంటింటికి‌ కరపత్రం అందజేసి అవగాహన కల్పించాలని‌‌ సూచించారు. పేద ప్రజలు నివసించే ప్రాంతాల్లో ప్రతి వినియోహదారునికి ఉచిత నీటి సరఫరా పథకం లాభాలను వివరించాలన్నారు. జలమండలి కార్యాలయాల్లో మీటర్లు అందుబాటులో ఉంటాయని, మీటర్ ఖరీదు రూ.1300, బిగించుటకు గాను రూ.200 మాత్రమే‌ చెల్లించాలన్నారు. ఉచిత నీటి పథకం కోసం 2021 ఆగస్ట్ 15 వ తేదీ లోపు ఆధార్ అనుసంధానం చేసుకుని మీటర్ ఏర్పాటు చేసుకుంటే డిసెంబర్ 2020 నుండి 31 ఆగస్ట్ 2021 వరకు నెలకు 20 వేల లీటర్ల సరఫరాకు 9 నెలల బిల్లు మినహాయింపు లభిస్తుందన్నారు. 2021 సెప్టెంబర్ నుంచి ప్రతి నెల 20 వేల లీటర్ల రాయితీ లభిస్తుందని ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ చెప్పారు. ఆగస్ట్ 15 తరువాత ఆధార్ అనుసంధానం తో మీటర్ ఏర్పాటు చేసుకున్నవారికి మినహాయింపు నమోదు చేసుకున్న తేదీ నుంచి నెలకు 20 వేల లీటర్ల వరకు రాయితీ ఇవ్వవబడుతుందని, 9 నెలల బిల్లు ను ఎలాంటి వడ్డీ,‌జరిమాన‌ లేకుండా చెల్లించాల్సి ఉంటుందన్నారు. ప్రతి ఒక్క వినియోగదారుడు ఆగస్ట్ 15 లోపు ఆధార్ అనుసంధానం చేసుకొని నెలకు 20,000 లీటర్ల ఉచిత నీటి పథకం ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రతీ ఇంటికి స్వచ్ఛమైన తాగు నీరు సరఫరా అయ్యేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని ప్రభుత్వ విప్ గాంధీ అధికారులకు సూచించారు. డివిజన్లలో విస్తరించిన కొత్త ప్రాంతాలను ఆయా డివిజన్ల కార్పొరేటర్ల ద్వారా సమాచారం తీసుకొని ప్రతిపాదిత పనుల కోసం అంచనాలు తయారు చేయాలని అధికారులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హఫీజ్ పేట్ సెక్షన్ జలమండలి అధికారులు జీఎం రాజశేఖర్, డీజీఎంలు నారాయణ, నాగప్రియ మేనేజర్లు సుబ్రమణ్యం, వెంకట్ రెడ్డి, నివర్తి సందీప్, యాదయ్య, సాయి చరిత, సునీత, పరమేశ్వరి, భాగ్యనగర్ సెక్షన్ జలమండలి జీఎం వినోద్, డీజీఎం వెంకటేశ్వర్లు, మేనేజర్లు ప్రశాంతి, ప్రియ, ఝాన్సీ, మాజీ కార్పొరేటర్ రంగారావు,మాజీ కౌన్సిలర్ వీరేశం గౌడ్, చందానగర్ డివిజన్ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

20 వేల లీటర్ల ఉచిత నీటి పథకం కరపత్రాన్ని విడుదల చేస్తున్న ప్రభుత్వ విప్ ఆరెకపూడి‌ గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here