వీడియోకాల్ మాట్లాడుతూ రెండ‌వ అంత‌స్థు నుండి జారిప‌డి వ్య‌క్తి మృతి

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: సోద‌రుడితో వీడియోకాల్ మాట్లాడుతూ ప్ర‌మాద‌వ‌శాత్తు రెండ‌వ అంత‌స్థు నుండి జారిప‌డి ఓ వ్య‌క్తి మృతి చెందిన సంఘ‌ట‌న రాయ‌దుర్గం పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ శ్రీ‌నివాస్ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం… మ‌ణికొండ గార్డెన్స్ ఏరియాలో నివాస‌ముండే తాళ్లూరి శామ్యూల్ సుజీత్‌(32) ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. కాగా శ‌నివారం ఉద‌యం 6గం.ల స‌మ‌యంలో సుజీత్ త‌న నివాసంలోని రెండ‌వ అంత‌స్థులోని బాల్క‌నీలో నిల‌బ‌డి త‌న సోద‌రుడితో వీడియోకాల్ మాట్లాడుతున్నాడు. ప్ర‌మాద‌వ‌శాత్తు కాలుజార‌డంతో సుజీత్ అక్క‌డి నుండి కింద ప‌డిపోయాడు. గ‌మ‌నించిన ఇరుగుపొరుగు వారు కుటుంబ స‌భ్యుల‌కు తెల‌ప‌డంతో స‌మీపంలోని ఆసుప‌త్రికి త‌ర‌లించ‌గా అప్ప‌టికే మృతి చెందిన‌ట్లు వైద్యులు తెలిపారు. సోద‌రుడు సుశీల్ ఫిర్యాదుతో కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here