శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): జాతిపిత మహాత్మ గాంధీ 151 వ జయంతిని పురస్కరించుకొని శుక్రవారం లింగంపల్లి గ్రామంలోని గాంధీ విగ్రహానికి శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పూల మాల వేసి నివాళి అర్పించారు. మహాత్ముని సేవలు మరవలేనివన్నారు. పట్టభద్రులందరూ ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు చేయించుకోవాలని సూచిస్తూ ఫాం నం 18 ను రాగం నాగేందర్ యాదవ్ అందజేశారు. అనంతరం లింగంపల్లి గ్రామంలో పాదయాత్ర చేసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వై. కృష్ణ, మల్లాచారి, మల్లికార్జున్ యాదవ్, దేవులపల్లి శ్రీనివాస్, కిట్టు, వంశీ, సాయిముదిరాజ్, రాజశేఖర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

