చందాన‌గ‌ర్ పీఆర్‌కే హాస్పిట‌ల్‌లో ఉచిత క‌న్స‌ల్టేష‌న్ సేవ‌లు

  • ప్ర‌థ‌మ వార్షికోత్స‌వం సంద‌ర్భంగా మార్చి 17వ తేదీ వ‌ర‌కు ఆఫ‌ర్

చందాగ‌న‌ర్ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): చందానగర్‌ డివిజన్‌ పరిధిలోని చందానగర్‌లో ఉన్న పీఆర్‌కే హాస్పిటల్‌లో హాస్పిటల్‌ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ఉచిత కన్సల్టేషన్‌ను అందిస్తున్నారు. జనరల్‌ మెడిసిన్‌, జనరల్‌ సర్జరీ, ఆర్థోపెడిక్స్‌, గైనకాలజీ, పీడియాట్రిక్‌, ఈఎన్‌టీ, కిడ్నీ, వెన్నెముక తదితర విభాగాల్లో ఉచిత కన్సల్టేషన్‌ సేవలను అందిస్తున్నట్లు హాస్పిటల్‌ ఎండీ డాక్టర్‌ రవికుమార్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. తమ హాస్పిటల్‌లో అత్యాధునిక సౌకర్యాలను అంతర్జాతీయ ప్రమాణాలతో అందిస్తున్నట్లు తెలిపారు. హాస్పిటల్‌ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ఈ ఆఫర్‌ను అందిస్తున్నామని, మార్చి 17వ తేదీ వరకు ఈ ఆఫర్‌ను ఉపయోగించుకోవచ్చని తెలిపారు. మరిన్ని వివరాలకు 040-68306830 ఫోన్‌ నంబర్‌లో సంప్రదించవచ్చని తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here