- ఈ నెల 30వ తేదీ వరకు అవకాశం
శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 9 (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్‌లోని మెడికవర్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్‌లో మహిళలకు ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ ప్యాకేజీని అందిస్తున్నట్లు హాస్పిటల్ ప్రతినిధులు తెలిపారు. ఈ మేరకు స్పోర్ట్స్ అండ్ ఫిట్‌నెస్ కన్సల్టెంట్, సర్టిఫైడ్ ఫంక్షనల్ ట్రైనింగ్ అండ్ వెల్‌నెస్ కోచ్, మెంటల్ హెల్త్ అడ్వకేట్, ఫిట్‌నెస్ ఎంటర్‌ప్రెన్యూర్ దీప్తి అక్కి, టీవీ నటి లహరి, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ ప్రవీణ్ అడుసుమిల్లి, మెడికవర్ హాస్పిటల్స్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ మహేష్ దెగ్లూర్కర్ లు సోమవారం హాస్పిటల్‌లో ఈ ప్యాకేజీ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దీపి అక్కి మాట్లాడుతూ మారుతున్న జీవనశైలి, ఒత్తిడి, ఇతర కారణాల వల్ల మహిళలు ఎన్నో అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారని అన్నారు. ముఖ్యంగా చాలా మంది మహిళలకు క్యాన్సర్ వస్తుందన్నారు. పలు ముందస్తు పరీక్షలతో మనం క్యాన్సర్‌ని ముందుగానే గుర్తించవచ్చన్నారు. దీంతో సరైన చికిత్స అందించేందుకు వీలుంటుందన్నారు.
అనంతరం డాక్టర్ ప్రవీణ్ అడుసుమిల్లి మాట్లాడుతూ ప్రతి 87 మంది మహిళల్లో ఒకరు అండాశయ క్యాన్సర్ బారిన పడుతున్నారని తెలిపారు. ఈ తరహా క్యాన్సర్ వస్తే లక్షణాలు ముందుగా కనిపించవని అన్నారు. ముందస్తు చెకప్ చేయించుకోవడం ద్వారా ప్రాణాలను కాపాడుకోవచ్చన్నారు. 40 ఏళ్ల పైబడిన వయస్సు ఉన్నవారిలో, రుతు క్రమంలో మార్పులు, వెన్ను నొప్పి, కుటుంబ నేపథ్యం, పొత్తి కడుపులో నొప్పి, మలబద్దకం, కలయికలో నొప్పి, కడుపు ఉబ్బరం వంటి లక్షణాలు ఉంటే క్యాన్సర్ ఉండే అవకాశం ఉంటుందన్నారు. కనుక ఇలాంటి లక్షణాలు ఉన్న మహిళలు తాము అందిస్తున్న ఈ ఉచిత ప్యాకేజీలో భాగంగా పరీక్షలు చేయించుకోవచ్చని తెలిపారు. అనంతనం మహేష్ దెగ్లూర్కర్ మాట్లాడుతూ మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ లో అత్యాధునిక సదుపాయాలు, పరికరాలు, హై ఎండ్ రోబోటిక్స్ మెషిన్స్, పెట్ సిటి స్కాన్స్, అనుభజ్ఞులైన డాక్టర్స్ 24 గంటలు అందుబాటులో ఉంటారని తెలిపారు. ఈ క్యాంపులో భాగంగా క్యాన్సర్ యాంటీజెన్ 125, అల్ట్రాసౌండ్, సీబీపీ, షుగర్ టెస్ట్ వంటి పరీక్షలు చేస్తారని, అనంతరం ఉచితంగా క్యాన్సర్ స్పెషలిస్ట్ కన్సల్టేషన్ ఉంటుందని తెలిపారు. ఈ నెల 30వ తేదీ వరకు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చని తెలిపారు.