శేరిలింగంపల్లి, మార్చి 25 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్‌లో స్థానిక నాయకుడు అట్టేపల్లి రామప్రభు మియాపూర్ ప్రజల ఆరోగ్యరీత్యా ఏర్పాటు చేసిన ఉచిత అంబులెన్స్‌ను శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ప్రారంభించారు. స్థానిక ప్రజలకు అత్యవసర సమయాల్లో వైద్య సాయం త్వరితగతిన అందాలనే ఉద్దేశంతో ఈ అంబులెన్స్‌ను అందుబాటులోకి తెచ్చారు. ప్రజల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి ఈ ఏర్పాట్లు చేసిన రామప్రభును ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభినందించారు. ఈ కార్యక్రమంలో హైదర్ నగర్ మాజీ కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు, శేరిలింగంపల్లి కాంగ్రెస్ కో-ఆర్డినేటర్ రఘునాథ్ రెడ్డి, అట్టేపల్లి పురుషోత్తం శర్మ, సమ్మెట ప్రసాద్, డాక్టర్ రవికుమార్ చౌదరి, నరసింహారెడ్డి, రాజేంద్రప్రసాద్, స్వామి, ఆంజనేయులు ప్రసాద్, నాయుడు, ఏ ఆర్ పి టీం సభ్యులు, కాలనీ సభ్యులు పాల్గొన్నారు.






