శేరిలింగంపల్లి, ఆగస్టు 6 (నమస్తే శేరిలింగంపల్లి): కొండాపూర్ డివిజన్ పరిధిలోని ప్రేమ్ నగర్ బి బ్లాక్ కాలనీలో ఉన్న శ్రీ దక్షిణా ముఖ అభయాంజనేయ స్వామి దేవాలయంలో నూతనంగా చేపట్టబోయే స్లాబ్ నిర్మాణం పనులకు భూమి పూజ కార్యక్రమంలో PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ శ్రీ దక్షిణా ముఖ అభయాంజనేయ స్వామి దేవాలయంకు నూతనంగా చేపట్టబోయే స్లాబ్ నిర్మాణం పనులకు భూమి పూజ చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం అని , దేవాలయం లో భక్తులకు అన్ని వసతులు ఏర్పాటు చేయడం అభినందనీయం అని, స్లాబ్ నిర్మాణము పనులు త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులో కి తీసుకురావాలని , నాణ్యతా ప్రమాణాలతో చేపట్టాలని ఆలయ కమిటీ సభ్యులకు తెలియచేశారు. ఆలయ అభివృద్ధి లో తన వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు , ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.






