పారిశుద్ధ్య సిబ్బంది సేవ‌ల‌ను మ‌రిచిపోలేం: PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ

శేరిలింగంపల్లి, ఆగ‌స్టు 7 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి సర్కిల్ పరిధిలోని కొండాపూర్, గచ్చిబౌలి, శేరిలింగంపల్లి , భారతి నగర్ డివిజన్ల పరిధిలో పనిచేస్తున్న పారిశుధ్య సిబ్బందికి శేరిలింగంపల్లి జోనల్ కార్యలయంలో జోనల్ కమిషనర్ హేమంత్ బొర్ఖడే, డీసీ శశిరేఖ, కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి, AMOH శ్రీకాంత్ రెడ్డి తో కలిసి PPE కిట్లను పారిశుధ్య సిబ్బందికి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ అందజేశారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ పారిశుధ్య సిబ్బంది తల్లిదండ్రులతో సమానం అని అన్నారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో వారి సేవలు మ‌రిచిపోలేమ‌ని తెలిపారు. మన పరిసర ప్రాంతాలను , కాలనీ లను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుతూ, కాలనీ లలో ప్రశాంత వాతావరణం క‌ల్పించేందుకు అను నిత్యం తీవ్రంగా శ్ర‌మిస్తుంటార‌ని అన్నారు. పరిసరాల పరిశుభ్రతే ధ్యేయంగా పనిచేస్తార‌ని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మారబోయిన రాజు యాదవ్, మంత్రిప్రగడ సత్యనారాయణ, రంగస్వామి, పారిశుధ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here