సైబరాబాద్ (నమస్తే శేరిలింగంపల్లి): సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నూతనంగా నిర్మించనున్న సైబర్ క్రైమ్ భవన నిర్మాణ పనులకు సీపీ వీసీ సజ్జనార్ శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ ఎస్ఎమ్ విజయ్ కుమార్, ఎస్సీఎస్సీ ప్రధాన కార్యదర్శి కృష్ణ ఏదుల, ఫీనిక్స్ గ్రూప్ డైరెక్టర్ శ్రీకాంత్ బడిగ, ట్రాపిక్ ఏడీసీపీ ప్రవీణ్ కుమార్, సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ ఏడీసీపీ మాణిక్ రాజ్, క్రైమ్స్-1 ఏడీసీపీ కవిత, క్రైమ్స్-2 ఏడీసీపీ ఇంద్ర, క్రైమ్స్-3 ఏడీసీపీ రామచంద్రులు, సైబర్‌క్రైమ్ ఏసీపీ ఏవీఆర్ నరసింహా రావు పాల్గొన్నారు.
