శేరిలింగంపల్లి, మార్చి 21 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని తారానగర్, సిటిజన్స్ కాలనీ, చందానగర్, హఫీజ్‌పేట, వివిధ ప్రాంతలలో ముస్లింల ఆహ్వానం మేరకు మాజీ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ముఖ్య అతిథిగా వారి స్వగృహలకు వెళ్లి రంజాన్ ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రాగం నాగేందర్ యాదవ్ గచ్చిబౌలి విలేజ్ ప్రెసిడెంట్ సయ్యద్ నయీమ్ ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా వెళ్లి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నయీమ్ స్వగృహంలో ఏర్పాటుచేసిన విందులో పాల్గొని ఆతిథ్యాన్ని స్వీకరించారు. ఈ సందర్బంగా నాగేందర్ యాదవ్ మాట్లాడుతూ.. పవిత్ర రంజాన్ పర్వదినాన్ని శాంతి, పరస్పర సహకారం, ఐక్యమత్యంతో జరుపుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు, యువ నాయకులు, ముస్లింలు తదితరులు పాల్గొన్నారు.






