ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన రఘునాథ్ రెడ్డి

శేరిలింగంప‌ల్లి, మార్చి 21 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): పవిత్ర రంజాన్ (ఈద్-ఉల్-ఫితర్) పండుగను పురస్కరించుకుని చందానగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రఘునాథ్ రెడ్డి ముస్లింలకు తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. చందానగర్ డివిజన్ పరిధిలోని ఈద్గా వద్ద నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలలో ముఖ్య అతిథిగా రఘునాథ్ రెడ్డి పాల్గొన్నారు. ముస్లింలతో కలిసి భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం అందరినీ ఆలింగనం చేసుకుని పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ రంజాన్ పండుగ శాంతి, ఐక్యత, సోదరభావానికి నిదర్శనమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ రవీందర్, రాఘవరావు, ప్రీతమ్, ఇతర పార్టీ కార్యకర్తలు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here