మెడికవర్ హాస్పిటల్స్ లో ఫ్యామిలీ డెంటల్ ప్యాకేజీలు

శేరిలింగంప‌ల్లి, మార్చి 21 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ప్రపంచ మౌఖిక ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని హైటెక్ సిటీలోని మెడికవర్ హాస్పిటల్స్ ప్రత్యేక దంత ఆరోగ్య అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. Smile Brighter This Summer అనే థీమ్‌తో కుటుంబ సభ్యుల కోసం ప్రత్యేక డెంటల్ ప్యాకేజీలు, అలాగే సీనియర్ సిటిజన్స్ కోసం ఉచిత దంత పరీక్ష కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ నటి నభా నటేష్, ప్రముఖ నటుడు రాజా రవీంద్రతో పాటు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డా. ఎ. శరత్ రెడ్డి, మెడికవర్ హాస్పిటల్స్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పి. హరి కృష్ణ హాజ‌రై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సీనియర్ సిటిజన్స్ కోసం ఏప్రిల్ 15, 2026 వరకు ఉచిత డెంటల్ చెకప్ సౌకర్యాన్ని ప్రకటించారు.

అదేవిధంగా సమ్మర్ స్పెషల్ ఫ్యామిలీ డెంటల్ ప్యాకేజ్‌లో కుటుంబ సభ్యులకు డెంటల్ కన్సల్టేషన్, డిజిటల్ OPG ఎక్స్-రే సౌకర్యం, అలాగే అన్ని డెంటల్ ట్రీట్మెంట్స్‌పై 30 శాతం తగ్గింపు అందిస్తున్నారు. ఈ ప్యాకేజ్‌ను ప్రత్యేక రాయితీ ధర రూ.1999కు అందుబాటులో ఉంచారు. ఈ ఆఫర్ జూన్ 30, 2026 వరకు చెల్లుబాటులో ఉంటుంది. ఈ సందర్భంగా వైద్య నిపుణుడు ప్రోస్థోడాంటిస్ట్, ఇంప్లాంటాలజిస్ట్ డా. సి. శరత్ బాబు మాట్లాడుతూ, నోటి ఆరోగ్యం మొత్తం శరీర ఆరోగ్యానికి ఎంతో కీలకమని, దంతాల సంరక్షణ ద్వారా అనేక వ్యాధులను ముందుగానే నివారించవచ్చని తెలిపారు. ముఖ్యంగా వేసవి కాలంలో సరైన మౌఖిక పరిశుభ్రత పాటించడం అత్యంత అవసరమని సూచించారు. ఈ కార్యక్రమంలో మెడికవర్ హాస్పిటల్స్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ మహేష్ డెగ్లూర్కర్, వైద్య నిపుణులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here