హాకీ జాతీయ క్యాంపును ప్రారంభించిన హాకీ సంఘం అధ్య‌క్షుడు కొండా విజయ్ కుమార్

శేరిలింగంప‌ల్లి, మార్చి 21 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ఏప్రిల్ 1 నుండి 12వ తేదీ వరకు జార్ఖండ్ లోని రాంచీలో మహిళల‌ సబ్ జూనియర్ జాతీయ హాకీ టోర్నమెంట్ ను నిర్వహించనున్నట్లు హాకీ ఆసోసియేషన్ అధ్య‌క్షుడు కొండా విజయ్ కుమార్ తెలిపారు. టోర్నమెంట్ లో పాల్గొనున్న‌ తెలంగాణ మహిళా హాకీ జట్టుకు వారం రోజుల పాటు గచ్చిబౌలి హాకీ గ్రౌండ్ లో నిర్వహించ‌నున్న క్యాంప్ ను హాకీ అసోసియేషన్ అధ్య‌క్షుడు కొండా విజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ నెల 27 వరకు ఈ క్యాంపు కొనసాగుతుంద‌ని అసోసియేషన్ సభ్యులు తెలిపారు. క్యాంప్ లో భాగంగా ప్రత్యేక కోచ్ ల ద్వారా శిక్షణ ఇస్తున్నట్లు పేర్కొన్నారు క్యాంపులో మొత్తం 21 మంది హాకీ సబ్ జూనియర్ మహిళలకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సెక్రెటరీ భీంసింగ్, రంగారెడ్డి జిల్లా సెక్రటరీ కె. భాస్కర్ రెడ్డి , ట్రెజరర్ వి పాండు రంగారెడ్డి, రాజశేఖర్ , వేణు, మహిళా కోచ్ లు పాల్గొన్నారు.

బీహార్ రాజ్ గిర్ లో బాలుర టోర్నమెంట్..

బీహార్ రాజ్ గిర్ లో ఏప్రిల్ 1 నుండి 12వ తేదీ వరకు జాతీయ సబ్ జూనియర్ హాకీ టోర్నమెంట్‌లో పాల్గొనున్న‌ బాలుర జట్టుకు క్యాంప్ సైతం ప్రారంభించారు. 21 మంది బాలురు పాల్గొనున్న క్యాంపును ఈ నెల 28 వరకు కొనసాగించ‌నున్న‌ట్లు అసోసియేషన్ అధ్య‌క్షుడు కొండా విజయ్ కుమార్ తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here