అంబేద్క‌ర్ చూపిన మార్గాన్ని ప్ర‌తి ఒక్క‌రూ అనుస‌రించాలి: అట్టేపల్లి రామప్రభు

శేరిలింగంప‌ల్లి, ఏప్రిల్ 14 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): బీఆర్ అంబేద్క‌ర్ 135వ జయంతి సందర్భంగా ఎం.ఏ. నగర్‌లో అన్న‌దాన కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అట్టేపల్లి రామప్రభు హాజ‌రై డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూల మాల‌లు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆర్‌బీఆర్ కాంప్లెక్స్‌లో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అట్టేపల్లి లక్ష్మీనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మ‌న్‌ అట్టేపల్లి రామప్రభు అన్నదానంలో సేవలందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ అంబేద్కర్ చూపించిన సమానత్వం, సామాజిక న్యాయం మార్గాన్ని అందరూ అనుసరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జగదీశ్వర్ గౌడ్, మోహన్ ముదిరాజ్, టిప్పర్ శ్రీను, కబీర్, మహేష్ యాదవ్, రాంబాబు, గంగాధర్, ఉత్తమ్, ఓం ప్రకాష్ గౌడ్, శ్రీశైలం, రవిగౌడ్, నరేందర్ గౌడ్, రాజశేఖర్, రాజేష్, లాలయ్య, రాములు, ఇలియాజ్‌ షరీఫ్, బీఎస్ఎన్ కిరణ్ యాదవ్, ఎలమంచి ఉదయ్, కాజా, వినీత్, సాయితేజ, అజయ్, ప్రశాంత్, శ్రీరామ్, ARP TEAM సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here