బీజేపీ మాత్ర‌మే అంబేద్క‌ర్ ఆశ‌యాల‌ను కొన‌సాగిస్తోంది: రవికుమార్ యాదవ్

శేరిలింగంప‌ల్లి, ఏప్రిల్ 14 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): దేశంలో ప్రతి సామాన్యుడికి ఓటు హక్కు, సమాన గౌరవం దక్కాయంటే అది కేవలం అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లే అని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంచార్జి రవికుమార్ యాదవ్ అన్నారు. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా నియోజకవర్గంలోని లింగంపల్లి డివిజన్ మసీద్ బండ గ్రామం, రాజీవ్ గృహకల్ప , చందా నగర్ డివిజన్ గంగారం, మియాపూర్ డివిజన్ ఏం. ఏ నగర్, మక్తా మహబూబ్ పేట్, ఓంకార్ నగర్, హైదర్ నగర్ డివిజన్ హైదర్ నగర్ గ్రామం, ఆల్విన్ కాలనీ డివిజన్ మహంకాళి నగర్ , కొండాపూర్ డివిజన్ ప్రేమ్ నగర్ ఎ బ్లాక్ కాలనీలలో అంబేద్క‌ర్ చిత్ర‌ప‌టాలు, విగ్ర‌హాల‌కు ఆయన పూల‌మాల‌లు వేసి ఘ‌నంగా నివాళులు అర్పించారు. ఈ సంద‌ర్భంగా రవికుమార్ యాద‌వ్ మాట్లాడుతూ అంబేద్క‌ర్ ఆశ‌యాల‌ను కొన‌సాగిస్తుంది కేవ‌లం బీజేపీనే అని అన్నారు. ఆయ‌న క‌న్నుమూసిన ఎన్నో ఏళ్ల త‌రువాత బీజేపీ మ‌ద్ద‌తు ఉన్న ప్ర‌భుత్వ హ‌యాంలోనే ఆయ‌న‌కు భార‌త‌రత్న ల‌భించిందని అన్నారు. ఈ కార్యక్రమాలలో ఆయా కాలనీల అంబేద్కర్ అసోసియేషన్ నాయకులు, సభ్యులు, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, డివిజన్ నాయకులు, వివిధ మోర్చల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here