శేరిలింగంపల్లి, ఏప్రిల్ 14 (నమస్తే శేరిలింగంపల్లి): భారత రాజ్యంగ నిర్మాత డా. బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా మియాపూర్ డివిజన్ పరిధిలోని నడిగడ్డ తండా, సుభాష్ చంద్రబోస్ నగర్, మక్తా మహబూబ్ పేట్ విలేజ్ లలోని అంబేద్కర్ విగ్రహాలకి సీనియర్ నాయకులు మర్రపు గంగాధర్ రావు, బండారు మోహన్ ముదిరాజ్, స్థానిక నాయకులతో కలిసి మియాపూర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లడుతూ రాజ్యాంగ సృష్టి కర్త, మేధావి, బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి, భారత రాజ్యంగ నిర్మాత, ఆర్థిక వేత్త , న్యాయ కోవిదుడు, రాజనీతిజ్ఞుడు, ప్రపంచ మేధావి , దేశానికి దశ , దిశ చూపిన మహానుభావుడు, ప్రపంచానికి మన రాజ్యాంగం ఒక రోల్ మోడల్ అని, సమానత్వం కోసం, అందరికీ సమానత్వం ఉండాలని, అంటరానితనం, అసమానతలు, వివక్షలపై అలుపెరుగని పోరాటం చేసిన మహానీయుడు అంబేద్కర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నడిగడ్డ తండా గిరిజన సంక్షేమ సంఘం సభ్యులు, సుభాష్ చంద్రబోస్ నగర్ కాలనీవాసులు, మక్తా మహబూబ్ పేట్ విలేజ్ వాసులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.






