సైబరాబాద్ (నమస్తే శేరిలింగంపల్లి): పేదలకు ప్రభుత్వాలు సహాయం చేస్తాయిలే అని ఎదురు చూడకుండా సమాజంలోని మంచి మనస్సున మహరాజులు, దాతలు, స్వచ్ఛంద సంస్థలు చేయూతను అందించేందుకు ముందుకు రావాలని సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ అన్నారు. బుధవారం సైబరాబాద్ పోలీసులు, డిగ్నిటీ డ్రైవ్ ఫౌండేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో ఫీనిక్స్ ఎరీనా కల్చరల్ సెంటర్లో మెగా బ్లాంకెట్స్ అండ్ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ డ్రైవ్‌ను నిర్వహించారు. ఇందులో భాగంగా సీపీ సజ్జనార్, ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు రెనీ గ్రేస్‌లు పేదలకు దుప్పట్లను, ఆహార ప్యాకెట్లను పంపిణీ చేశారు.

ఈ సందర్బంగా సీపీ సజ్జనార్ మాట్లాడుతూ పేదల కోసం డిగ్నిటీ డ్రైవ్ సంస్థ చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ ఇలా పేదలకు సేవ చేసేందుకు ముందుకు రావాలన్నారు. ఈ కార్యక్రమంలో పారిశ్రామిక వేత్త చక్రధర్ గౌడ్, డిగ్నిటీ డ్రైవ్ ప్రతినిధులు, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.






