న్యుమోనియాపై అంద‌రికీ అవ‌గాహ‌న ఉండాలి: డాక్ట‌ర్ రాజమనోహర్ ఆచార్యులు

శేరిలింగంప‌ల్లి, న‌వంబ‌ర్ 11 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ప‌్ర‌పంచ న్యుమోనియా దినోత్స‌వం సంద‌ర్భంగా మెడిక‌వ‌ర్ హాస్పిట‌ల్స్ ఆధ్వ‌ర్యంలో అవ‌గాహ‌న కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఈ సంవ‌త్స‌రం Championing the fight to stop pneumonia అనే థీమ్ తో ప్రచారం నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా హాస్పిట‌ల్ డాక్ట‌ర్ వి రాజమనోహర్ ఆచార్యులు మాట్లాడుతూ. ప్ర‌పంచ వ్యాప్తంగా ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల మరణాలకు కారణమైన ప్రపంచంలోనే అతిపెద్ద అంటువ్యాధి అని, న్యుమోనియా అనేది బాక్టీరియా, వైరస్‌లు లేదా ఫంగల్ ఇన్‌ఫెక్షన్ల కారణంగా ఏర్పడే ఒక ఇన్ఫ్లమేటరీ రెస్పిరేటరీ డిజార్డర్ అని అన్నారు.

ఊపిరితిత్తుల గాలి సంచులను అల్వియోలీ అని పిలుస్తారు. ఇది గాలి సంచులలో ద్రవం లేదా చీము చేరడం వల్ల శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. ఇది ఒక అంటు వ్యాధి, బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్న వ్యక్తికి, ముఖ్యంగా పిల్లలు, వృద్ధులలో ప్రాణాంతకం కావచ్చు. న్యుమోనియా అనేది నివారించదగిన, చికిత్స చేయగల అంటు వ్యాధి. చికిత్స అందుబాటులో ఉన్నప్పటికీ, గత సంవత్సరాల్లో న్యుమోనియా, ఇతర శ్వాసకోశ అంటువ్యాధుల కారణంగా మరణాల సంఖ్య బాగా పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా న్యుమోనియా కారణంగా పెద్దలు, చిన్నపిల్లలు కొన్ని లక్షల మంది ప్రాణాలను కోల్పోతున్నారు.

డాక్ట‌ర్ రాజమనోహర్ ఆచార్యులు

5 లేదా అంతకంటే తక్కువ వయసున్న పిల్లలు, 65 అంతకంటే ఎక్కువ వయస్సు పెద్దవారు, ఆస్తమా, దీర్ఘకాలికి సీఓపీడీ, గుండె వ్యాధులు ఉన్నవారు, సిగరెట్‌ స్మోకింగ్‌ అధికంగా చేసేవారు, బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ కలిగిఉన్నవారు, కొన్ని రసాయనాలు, కాలుష్య కారకాలకు, విషపూరిత పొగలకు గురైనవారు ఈ వ్యాధి బారిన ప‌డుతున్నార‌ని అన్నారు. ఈ వ్యాధికి గురైన వారు దగ్గు, రక్తంతో కూడిన కఫం , చలి జ్వరం, శ్వాస కోశాల్లో నొప్పి, ఛాతీ భాగంలో నొప్పి, తలనొప్పి, ఆక్సిజన్‌ స్థాయిల్లో హెచ్చుతగ్గులు వంటి లక్షణాలు కనిపిస్తాయ‌ని, న్యుమోనియా అంటువ్యాధి అని, వ్యాధి సోకిన వ్యక్తి దగ్గడం, తుమ్మడం వల్ల క్రిములు మనం పీల్చే గాలిలోకి వ్యాప్తిచెందుతాయి. ఈ వ్యాధి సోకడం వల్ల కిడ్నీ, గుండె, కాలేయం లాంటి శరీరం లో ఉన్న ఇతర అవయవలు కూడా దెబ్బ తింటాయ‌ని క‌నుక జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని అన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here