శేరిలింగంపల్లి, నవంబర్ 11 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని మాదాపూర్ డివిజన్ ఇజ్జత్ నగర్ నివాసి ఓరుగంటి శ్యామ్ అనారోగ్యం కారణంగా చికిత్స పొందిన అనంతరం శేరిలింగపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి కార్యాలయాన్ని సంప్రదించగా ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేయించి ఆయనకు మంజూరు అయిన రూ.1,17,500 చెక్కును నియోజకవర్గ నాయకులతో కలిసి బాధితురాలికి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వి.జగదీశ్వర్ గౌడ్ అందజేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు కృష్ణ, భుజంగం, దొంతి కార్తీక్, భరత్, ప్రదీప్, హనీఫ్ తదితరలు పాల్గొన్నారు.