సమాన పనికి సమాన వేతనం కల్పించాలి: తిప్పర్తి మహేష్

శేరిలింగంప‌ల్లి, మే 1 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప‌రిధిలోని చందాన‌గ‌ర్ లో ఉన్న మియాపూర్ సర్కిల్ ఆఫీస్ లో మేడే ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ మున్సిపల్ ఉద్యోగ కార్మిక సంఘం జేఏసీ చైర్మన్ తిప్పర్తి మహేష్ హాజరై కార్మికుల జెండా ఎగరవేసి మాట్లాడుతూ కార్మికులు, కర్షకులు ఏకం కావాల‌ని పిలుపునిచ్చారు. కార్మికులు కష్టపడి శ్రమ చేస్తున్నారని, కార్మికులందరికీ సమాన పనికి సమాన వేతనం కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జవాన్ వినోద్ కుమార్, ఉద్యోగ కార్మిక సంఘం నాయకులు రామప్ప, బాలాజీ, కనకరాజు, గురుచరణ్, మహేష్, జితేందర్ నాయక్, నాగరాజ్, బిక్షపతి, రాములు, ఆనంద్, కార్మికులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here