శ్రీల గార్డెన్ కాలనీ స‌మ‌స్య‌ల పరిష్కారానికి కృషి: మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్

శేరిలింగంప‌ల్లి, మే 1 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని శ్రీల గార్డెన్ కాలనీలో నెల‌కొన్న పలు సమస్యలు, చేపట్టవలసిన పలు అభివృద్ధి పనులపై, కాలనీ వాసులతో కలిసి మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పాదయాత్ర చేసి పలు సమస్యలను పరిశీలించారు. ఈ సంద‌ర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ శ్రీల గార్డెన్ కాలనీలో ఉన్నటువంటి సమస్యలను స్వయంగా పర్యటించి పరిశీలించడం జరిగింద‌ని అన్నారు. అక్కడికక్కడే అధికారులతో మాట్లాడి చిన్న చిన్న సమస్యలను పరిష్కరించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీల గార్డెన్ కాలనీ అధ్యక్షుడు ఫణి కుమార్, ప్రవీణ్ కుమార్, విశ్వనాధ్, జగదీశ్, జస్వంత్ , కేశవప్రసాద్, కృష్ణారావు, నాగేశ్వరరావు, రమేష్, రాఘవ రెడ్డి, చేతన్, గోపాల్, అభినయ్, మధు, హరనాధ్, రాంబాబు, సాయిబాబా, మహేష్, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here