శేరిలింగంపల్లి, జనవరి 4 (నమస్తే శేరిలింగంపల్లి): పద్మశ్రీ పురస్కార గ్రహీత డా. శోభా రాజు ఆధ్వర్యంలో జరుగుతున్న నిత్య కార్యక్రమాలలో ఈ వారం అన్నమ నృత్యార్చనలో గురుకులం మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ కూచిపూడి నృత్య గురువు పోపూరి లక్ష్మి తులసి, శిష్య బృందం పోపూరి షన్ముఖ వేద, శ్రీ కృతి మారెల్ల, అఖిల, శ్రీ సన్నుతి, ఆద్య, అలేఖ్య, కృతి, సన్హిత, హర్షిత, శ్రీ చక్రిక, వెంకట శ్రీ భవ్య, వెంకట భావిక సంయుక్తంగా కూచిపూడి నృత్యం తో ఆనంద నర్తన గణపతి, కొలువైతివి రంగు సాయి, తక్కువేమి మనకు, అలరులు కురియగ, ముద్దుగారే యశోద, పలుకుతేనెల తల్లి, నారాయణతే, సినర్జీ, ఎంత మాత్రమున అనే ప్రఖ్యాత సంకీర్తనలకు తమ నృత్య ప్రతిభను సభక్తి పూర్వకంగా ప్రదర్శించి అందరి ప్రశంసలు పొందారు. అనంతరం పద్మశ్రీ శోభా రాజు ఒక చక్కని అన్నమయ్య సంకీర్తనకు వివరణ ఇచ్చారు. తదనంతరం కళాకారులకు సంస్థ మేనేజింగ్ ట్రస్టీ డా. నందకుమార్ , సంస్థ వ్యవస్థాపకులు పద్మశ్రీ పురస్కార గ్రహీత డా. శోభా రాజు జ్ఞాపికలను అందించారు.