శేరిలింగంపల్లి, జనవరి 4 (నమస్తే శేరిలింగంపల్లి): ఆటిజం సమస్యతో బాధపడుతున్న చిన్నారి కుటుంబానికి మియాపూర్ డివిజన్ బీఆర్ఎస్ ప్రెసిడెంట్ బి.ఎస్.ఎన్ కిరణ్ యాదవ్ ఆర్థిక సహాయం అందజేశారు. వరుణ్ తేజ్ అనే చిన్నారి 4 ఏళ్ల వయస్సు నుంచి ఆటిజం సమస్యతో బాధపడుతున్నాడు. మెదడు అభివృద్ధి వయస్సుకు తగినట్లుగా ఉండదు. అతనికి ఓల్డ్ బోయిన్‌పల్లిలో ఉన్న ఓ హాస్పిటల్‌లో చికిత్స అందిస్తున్నారు. కాగా హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం రూ.50వేలు ఖర్చవుతుందని తెలపగా ఈ సమాచారాన్ని బి.ఎస్.ఎన్ కిరణ్ యాదవ్ కు తెలియజేశారు. దీంతో ఆయన స్పందించి ఆ మేర ఆర్థిక సహయాన్ని బాలుడి తండ్రి రవికుమార్ కు అందజేశారు.