ప్రయివేట్ పాఠశాలల యాజమాన్యాల స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి కృషి: PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ

శేరిలింగంప‌ల్లి, ఆగ‌స్టు 2 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి మండల గుర్తింపు పొందిన ప్రయివేట్ పాఠశాలల యాజమాన్య సంఘం అసోసియేషన్ కు ఎన్నికైన నూతన కార్యవర్గ సభ్యులు PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీని ఆయ‌న‌ నివాసంలో మర్యాదపూర్వకంగా క‌లిశారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నుకోబడిన కార్యవర్గ సభ్యులను PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ అభినందించారు. అనంత‌రం అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ పాఠశాలలకు ట్రేడ్ లైసెన్స్ సహా ఇతర ప్రైవేట్ పాఠశాలల సమస్యలపై సుదీర్ఘంగా PAC చైర్మన్ గాంధీతో చర్చించ‌డం జ‌రిగింద‌న్నారు. అనంత‌రం PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ స్నేహపూర్వకంగా స్పందించి నూతనంగా నియమితమైన అసోసియేషన్ కార్యవర్గానికి త‌న‌ హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు తెలియచేస్తున్నాను అని అన్నారు. త‌న‌ దృష్టికి వచ్చిన ప్రతి సమస్య పరిష్కారానికి త‌న‌ వంతు శాయశక్తులా కృషి చేస్తానని తెలిపారు. ఆయా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పారిష్కారం అయ్యేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యులు అధ్యక్షుడు ఏ.ఆర్. పవన్ కుమార్, కార్యదర్శి పి. త్రిమూర్తులు, ఖజాంచి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర, జిల్లా స్థాయి అసోసియేషన్ నాయకులు పి. అనిల్ కుమార్, శ్రీకాంత్ రెడ్డి, గాయం భీష్మా రెడ్డి, బరుసు వెంకటేశ్వరరావు, బందా నరేంద్రబాబు, ఎన్.ఎస్. రావు, ఏ.బీ.ఎన్ శ్రీనివాసరావు, శ్రీనివాస్ శంకర్, డి. విజయ్ కుమార్, ఇతర సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here