శేరిలింగంపల్లి, ఆగస్టు 3 (నమస్తే శేరిలింగంపల్లి): హాస్టల్ విద్యార్థులకు కనీస సౌకర్యాలను కల్పించాలని, వారు ఉండేందుకు సొంత భవనాలను ఏర్పాటు చేయాలని, పాకెట్ మనీ పెంచాలని డిమాండ్ చేస్తూ జాతీయ బిసి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య, శేరిలింగంపల్లి జాతీయ బీసీ సంక్షేమ సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు వల్లెపు మాధవరావు, హైదర్ నగర్ డివిజన్ అధ్యక్షుడు బాలకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు విద్యార్థులకు మద్దతు తెలిపారు.






