శేరిలింగంపల్లి, మార్చి 19 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని 64 చెరువులను సుందర శోభిత వనాలుగా తీర్చిదిద్దుతామని PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ అన్నారు. మియపూర్ డివిజన్ పరిధిలోని పటేల్ చెరువు,పెద్దకుడి చెరువు, రామసముద్రం కుంట చెరువు, నాయనమ్మ కుంట చెరువుల సుందరికరణలో భాగంగా Nexus select Malls కంపెనీ, IGUS, HDFC బ్యాంక్ ల వారి CSR ఫండ్స్ ద్వారా మల్లిగవాడ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా చేపట్టనున్న చెరువుల పునర్జీవనంలో భాగంగా సుందరీకరణ, పునరుద్ధరణ పనులకు లేక్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఆనంద్ మల్లిగవాడ్, కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, Nexus select Malls, IGUS, HDFC బ్యాంక్ ప్రతినిధుల తో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని 64 చెరువులను అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. చెరువులను సుందరీకరించడం ద్వారా స్వచ్ఛమైన నీరు ప్రజలకు లభిస్తుందన్నారు. చెరువుల్లో జలకళను సృష్టించి గ్రామీణ వాతావరణాన్ని కల్పించడమే లక్ష్యమని తెలిపారు. చెరువులను కాపాడితే అవి మనల్ని కాపాడుతాయన్నారు. చెరువుల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. చెరువులను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తుండడం శుభ పరిణామమని, అభినందించ దగిన విషయమని అన్నారు.
ఈ కార్యక్రమంలో Nexus Select Malls హైద్రాబాద్ సెంటర్ హెడ్ విషాంత్ దుగ్గల్, Nexus Select ట్రస్ట్ ముంబయి హర్ష బర్ద, IGUS ప్రతినిధులు నికిత్ కుమార్, ఈదర ఫణింధ్ర, ఐటీ సంస్థ ప్రతినిధులు రామ్ బొట్ట, చైతన్య, Nexus select మాల్స్ ప్రతినిధులు , నాయకులు ,కార్యకర్తలు , కాలనీల అసోసియేషన్ సభ్యులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.