శేరిలింగంపల్లి, అక్టోబర్ 13 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోనీ అరబిందో కాలనీ వాసులు కాలనీలోని పలు సమస్యలు, చేపట్టవలసిన పలు అభివృద్ధి పనులపై మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ ని ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. దీనిపై కార్పొరేటర్ శ్రీకాంత్ సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ అరబిందో కాలనీ వాసులు కాలనీలోని పలు సమస్యలు, చేపట్టవలసిన పలు అభివృద్ధి పనులపై తనను కలవడం జరిగిందని, త్వరలోనే కాలనీలో స్వయంగా పర్యటించి విడతల వారిగా సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. పలు కాలనీలలో ప్రజల నుండి వచ్చిన వినతి మేరకు, తమ దృష్టికి వచ్చిన సమస్యలను పరిగణనలోకి తీసుకొని PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ప్రత్యేక చొరవతో డివిజన్లో అత్యవసరం ఉన్న చోట, నిత్యం సమస్యలతో ఉన్న ప్రాంతాలలో ప్రథమ ప్రాధాన్యత గా పనులు పూర్తి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అరబిందో కాలనీ అధ్యక్షుడు నారాయణ రెడ్డి, రాంబాబు, బాలరెడ్డి, లోకేష్, రమేష్, అనిల్, శ్రీవాస్ రెడ్డి, నగేష్, నర్సిరెడ్డి, మోహన్, రాజశేఖర్ రెడ్డి, బాలకృష్ణ, కె ఏస్ బాబు, బద్రి, ఉమామహేశ్వరరావు, రమేష్, ప్రదీప్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.






