శేరిలింగంపల్లి, అక్టోబర్ 13 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ లోని వెజిటేబుల్ మార్కెట్ లో గ్యార్వి షరీఫ్ సందర్భంగా మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా కమిటీ సభ్యులు నాగేందర్ యాదవ్‌ను శాలువాతో సత్కరించారు. ముస్లిం మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ మాట్లాడుతూ మార్కెట్ అభివృద్ధికి కృషి చేస్తున్నామని త్వరలో శంకుస్థాపన కార్యక్రమాన్ని అందరి సమక్షంలో జరుపుకునే విధంగా కార్యాచరణ జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ ప్రెసిడెంట్ వీరేశం గౌడ్, సీనియర్ నాయకులు రఘునాథ్ రెడ్డి, యూసుఫ్, అక్బర్, వైస్ ప్రెసిడెంట్ ఖాజా పాషా, అజామ్, అజీమ్, సల్మాన్, మోయస్, శ్రీనివాస్, రాజు, లాల, చిన్నా, రవి, ప్రభాకర్ రెడ్డి, షరీఫ్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.






