శేరిలింగంపల్లి, జూలై 24 (నమస్తే శేరిలింగంపల్లి): గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గుల్ మెహర్ కాలనీ వాసులు పలు సమస్యలు, చేపట్టవలసిన పలు అభివృద్ధి పనులపై PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీని వివేకానంద నగర్ లోని తన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం సమర్పించారు. దీనిపై PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా గుల్ మెహర్ కాలనీ వాసులు మాట్లాడుతూ నల్లగండ్ల చౌరస్తాను విస్తరించాలని, కాలనీలలో అంపూర్తిగా మిగిలిపోయిన రోడ్లను, డ్రైనేజి వ్యవస్థను మెరుగుపరచాలని, అవసరమున్న చోట UGD పైప్ లైన్లు వేయాలని , వీధి దీపాలను ఏర్పాటు చేయాలని కోరారు.

ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ త్వరలోనే గుల్ మెహర్ కాలనీలో పర్యటిస్తానని, గుల్ మోహర్ కాలనీలో నెలకొన్న అసంపూర్తిగా మిగిలిపోయిన రోడ్లను, డ్రైనేజి సమస్యను త్వరితగతిన పరిష్కరిస్తామని తెలిపారు. అవసరమున్న చోట రోడ్లను, UGD పైప్ లైన్ లు ఏర్పాటు చేస్తామని అన్నారు. డ్రైనేజి వ్యవస్థను మెరుగుపరుస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ చైర్మన్ KBV సుబ్బారావు, గుల్ మెహర్ కాలనీ ప్రెసిడెంట్ షేక్ ఖాసీం, జనరల్ సెక్రెటరీ ఆనంద్ కుమార్, ఆర్గనైజింగ్ సెక్రెటరీ విల్సన్, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.





