శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 5 (నమస్తే శేరిలింగంపల్లి): విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరుడు మన అందరి జీవితాలలో సుఖశాంతులు నింపాలని కోరుకుంటున్నానని మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ అన్నారు. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని మియాపూర్ డివిజన్ పరిధిలోని మియాపూర్ విలేజ్, M A నగర్, సుభాష్ చంద్రబోస్ నగర్ కాలనీలలో ఏర్పాటు చేసిన వినాయక మండపాల వద్ద నిర్వహించిన పూజా కార్యక్రమాలలో స్థానిక నాయకులతో కలిసి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరుడి చల్లని దీవెనలు మియాపూర్ డివిజన్ ప్రజలందరిపై ఉండాలని ఆ విఘ్నేశ్వరున్ని కోరుకున్నట్లు కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మియాపూర్ డివిజన్ మహిళా అధ్యక్షురాలు చంద్రిక ప్రసాద్, మాజీ కాన్సిలర్ రామచంద్రర్ ముదిరాజ్, మియాపూర్ డివిజన్ మహిళా అధ్యక్షురాలు సుప్రజ, మోహన్ ముదిరాజ్, మహేందర్ ముదిరాజ్, వినయ్ ముదిరాజ్, రవి గౌడ్, రామచందర్ గౌడ్, సురేష్, శ్రీనివాస్, నరేందర్, సాయి గౌడ్, సంతోష్, సుభద్ర, లక్ష్మణ్, M A నగర్ కాలనీ వాసులు శివ ముదిరాజ్, పాండు, వినోద్, ప్రశాంత్, శ్రీను, డానియల్, ఏ శివ, భక్తులు తదితరులు పాల్గొన్నారు.





