శేరిలింగంపల్లి, డిసెంబర్ 19 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ లోని పర్ల్ విలేజ్ లో నూతనంగా చేపట్టబోయే ఔట్ డోర్ ఓపెన్ జిమ్ పనులను శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పరిశీలించారు. అనంతరం కాలనీ అసోసియేషన్ సభ్యులు బీటీ రోడ్డు గుంతలమయం అవ్వడంతో ఇబ్బందులకు గురవుతున్నామని కార్పొరేటర్ దృష్టికి తీసుకురాగా వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడి తగిన చర్యలు చేపట్టమని ఆదేశించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ త్వరలోనే బీటీ రోడ్డు పనులు ప్రారంభించి పూర్తి చేయిస్తానని, కాలనీలో ఇంకా ఏవైనా సమస్యలు ఉంటే తెలపాలని అన్ని సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పర్ల్ విలేజ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అనురాధ, సింహాచలం సత్యనారాయణ, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.






