శేరిలింగంపల్లి, డిసెంబర్ 19 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం హైదర్‌నగర్ డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో శనివారం విద్యుత్ సరఫరాకు ఆటంకం ఏర్పడుతుందని ఏఈ ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్ ఫీడర్ నిర్వహణ పనుల్లో భాగంగా కరెంటు ఉండదని అన్నారు. మయూరినగర్ సబ్ స్టేషన్ పరిధిలోని 11కెవి రామ్ నరేష్ నగర్ ఓహెచ్ ఫీడర్ పరిధిలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మిత్ర హిల్స్, ప్రశాంత్ నగర్, ఏఎస్ రాజు నగర్, ఓల్డ్ ఏజ్ హోమ్‌లలో కరెంటు ఉండదన్నారు. అలాగే మయూరినగర్ సబ్ స్టేషన్ పరిధిలోని 11కెవి లక్ష్మీనగర్ ఫీడర్ పరిధిలో ఉదయం 10.30 నుంచి 11 గంటల వరకు రత్నదీప్, హెచ్‌డీఎఫ్‌సీ లైన్, నమహా అపార్ట్‌మెంట్స్, బుద్ధ అపార్ట్‌మెంట్స్, దోవ కాలనీల్లో కరెంటు ఉండదన్నారు.





