నమస్తే శేరిలింగంపల్లి: మద్యంతాగి బైక్ నడిపి వెనకాల కూర్చున్న వ్యక్తిని బలిగొన్న ద్విచక్ర వాహనదారుడు కటకటాల పాలయ్యాడు. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మియాపూర్ నడిగడ్డ తండకు చెందిన తురుపాటి సంతోష్ కుమార్, నిజాం పేట్ ఇందిరమ్మ కాలనీకి చెందిన రావూరి పోతురాజు(58)లు ఈనెల 19న హీరోహోండా గ్లామర్ బైక్ (TS07GH4625) పై వెళుతుండగా నడిగడ్డ తండ సమీపంలోని విజయ దుర్గాదేవి ఆలయం వాహనం అదుపు తప్పి పడిపోయారు. కాగా వెనకాల కూర్చున్న పోతురాజు తలకు తీవ్ర గాయాలు కావడంతో గాంధీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పోతరాజు గురువారం మృతి చెందాడు. కాగా సంతోష్ కుమార్ మద్యం సేవించి ద్విచక్ర వాహనాన్ని నడపడం వల్ల ప్రమాదానికి గురైనట్లు గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసుకొని రిమాండ్ కు తరలించారు. 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి తీసుకొని దర్యాప్తు ముమ్మరం చేశారు.






