రైతు, కార్మిక కష్టాలు తీర్చలేని ప్రభుత్వాలు ఎక్కువ కాలం నిలబడలేవు: సిపిఐ రామకృష్ణ

నమస్తే శేరిలింగంపల్లి: వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ‌ను వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాలు పూర్తి స్థాయి ‘భారత్ బంద్’‌కు పిలుపునివ్వగా వామపక్షాలు బంద్ కు సంపూర్ణ మద్దతు తెలిపాయి. ఈ క్రమంలో సీపీఐ శేరిలింగంపల్లి నియోజకవర్గం సంయుక్త కార్యదర్శి రామకృష్ణ ను మాదాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. హైటెక్ సిటీ విద్యుత్ నగర్ లోని వారి నివాసం వద్ద ముందస్తు అరెస్టు చేసిన పోలీసులు మాదాపూర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ నిర్బంధాలతో బంధువులను, నిరసనలను అణచివేసిన్నప్పటికీ ఉద్యమం ఆగదని అన్నారు. రైతులు కార్మికుల ఆవేదన పట్టించుకోని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిలదొక్కుకోలేవని, త్వరలోనే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని అన్నారు.

రామకృష్ణను అరెస్టు చేస్తున్న మాదాపూర్ పోలీసులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here