చ‌లివేంద్రాల‌ను ఏర్పాటు చేసేందుకు దాత‌లు ముందుకు రావాలి: జగదీశ్వర్ గౌడ్

శేరిలింగంప‌ల్లి, ఏప్రిల్ 4 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): చ‌లివేద్రాల ఏర్పాటుతో వేస‌విలో ప్ర‌జ‌ల దాహార్తి తీరుతుంద‌ని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్ అన్నారు. నాయ‌కుడు క‌ట్ల శేఖ‌ర్ రెడ్డి ఆధ్వ‌ర్యంలో చందాన‌గ‌ర్‌లో ఏర్పాటు చేసిన చ‌లివేంద్రాన్ని జ‌గ‌దీశ్వ‌ర్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజ‌రై ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ వేస‌విలో ప్ర‌జ‌ల‌కు నీళ్లు అందిస్తూ దాహార్తిని తీర్చేందుకు చ‌లివేంద్రాల‌ను ఏర్పాటు చేయాల‌ని అన్నారు. దాత‌లు, స్వ‌చ్ఛంద సంస్థ‌లు ఇందుకు ముందుకు రావాల‌ని అన్నారు. క‌ట్ల శేఖ‌ర్ రెడ్డి చ‌ర్య‌ను ఆయ‌న అభినందించారు. ఈ కార్య‌క్ర‌మంలో డివిజ‌న్ అధ్య‌క్షుడు మ‌ధు, నాయ‌కులు ర‌ఘునాథ్ రెడ్డి, హ‌రి, రాజ‌న్‌, య‌ల‌మంచి ఉద‌య్‌కిర‌ణ్‌, కార్తీక్‌, ర‌షీద్‌, ఖాజా అయాజుముద్దీన్‌, పార్వ‌తి, క‌విత‌, న‌జియా, సంతోష్ యాద‌వ్‌, చంద్ర‌మౌళి పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here