ట్రాఫిక్ ర‌ద్దీని త‌గ్గించేందుకు నిరంత‌ర చ‌ర్య‌లు: PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ

శేరిలింగంప‌ల్లి, ఏప్రిల్ 4 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): కొండాపూర్ డివిజన్ పరిధిలోని వైట్ ఫీల్డ్ లో ఉన్న శ్రీ రామాలయం నుండి అంజయ్య నగర్ వరకు నెలకొన్న ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై టౌన్ ప్లానింగ్ విభాగం, ట్రాఫిక్ విభాగం, GHMC ఇంజనీరింగ్ విభాగం అధికారులతో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ పరిశీలించారు. ఈ సందర్బంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ వైట్ ఫీల్డ్ రామాలయం నుండి అంజయ్య నగర్ వరకు నిత్యం ట్రాఫిక్ సమస్యతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నార‌ని తెలిపారు. ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి రోడ్డు విస్తరణకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో కలిసి పాదయాత్రగా స్వయంగా నడుచుకుంటూ వెళ్లడం జరిగింద‌ని తెలిపారు. సాఫ్ట్ వేర్ ఉద్యోగులు, పాఠశాలలకు, కళశాలలకు వెళ్లే విద్యార్థులకు, ఉద్యోగులకు, వ్యాపారస్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో GHMC అధికారులు AE రాజేష్, టౌన్ ప్లానింగ్ ACP కరుణాకర్, నాయకులు నాయినేని చంద్రకాంత్ రావు, ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, బస్వరాజు, నర్సింహ సాగర్, గణపతి, కార్యకర్తలు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here