అల‌రించిన డాక్ట‌ర్ రాజు మ్యాజిక్ షో

శేరిలింగంప‌ల్లి, న‌వంబ‌ర్ 10 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం క‌డ‌ప జిల్లా రాజంపేట‌లో నిర్వ‌హించిన APMA 41 మ్యాజిక్ ఫెస్టివ‌ల్‌లో హైద‌రాబాద్‌కు చెందిన బి.ఎల్.ఎన్.రాజు మ్యాజిక్ షో చేసి అంద‌రినీ ఆశ్చ‌ర్యంలో ముంచెత్తారు. సుమారుగా 1000 మంది ప్రేక్ష‌కులు హాజ‌రైన ఈ కార్య‌క్ర‌మంలో ఆయ‌న త‌న మ్యాజిక్ షోతో అంద‌రినీ అబ్బుర ప‌రిచారు. రాజు మ్యాజిక్ షో ప్రేక్ష‌కుల‌ను అయోమ‌యంలో ఆనందంలో ముంచెత్తింది. ఈ సంద‌ర్భంగా మ్యాజిక్ షో ప్రాంగ‌ణం ప్రేక్ష‌కుల చ‌ప్ప‌ట్ల‌తో మారుమోగింది. అనంత‌రం APMA అధ్య‌క్షుడు, సెక్రెట‌రీ, ఇత‌ర ప్ర‌ముఖులు డాక్ట‌ర్ రాజును ఘ‌నంగా స‌న్మానించారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ డాక్ట‌ర్ రాజు త‌న అద్భుత‌మైన మ్యాజిక్ షోతో అంద‌రినీ ఎంత‌గానో ఆక‌ట్టుకున్నార‌ని అన్నారు. ప్ర‌స్తుతం అనేక మంది సెల‌బ్రిటీలు మ్యాజిక్ షోల ద్వారా ఉన్న‌త స్థానాల‌కు చేరుకున్న వారే అని, మెజిషియ‌న్ల‌కు ప్ర‌జ‌ల నుంచి విశేష రీతిలో ఆద‌ర‌ణ ల‌భిస్తుంద‌ని అన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here