చందాన‌గ‌ర్ స‌ర్కిల్ ప్ర‌జావాణికి 9 ఫిర్యాదులు

శేరిలింగంప‌ల్లి, న‌వంబ‌ర్ 10 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంప‌ల్లిలోని చందాన‌గ‌ర్ స‌ర్కిల్ కార్యాల‌యంలో సోమ‌వారం నిర్వ‌హించిన ప్ర‌జావాణి కార్య‌క్ర‌మంలో డిప్యూటీ క‌మిష‌న‌ర్ డి. శ‌శిరేఖ‌, రెవెన్యూ విభాగం కృష్ణ‌, ఏసీపీ నాగిరెడ్డి, ఏఎంవోహెచ్ డాక్ట‌ర్ కేఎస్ ర‌వి, ఇంజినీరింగ్ విభాగం శ్రీ‌దేవి, ఎంట‌మాల‌జీ ఆర్‌.చిన్నా, యూబీడీ సెక్ష‌న్ స‌మీర‌, ఎల‌క్ట్రిక‌ల్ విభాగం ల‌క్ష్మీ ప్రియ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా సంబంధిత విభాగాల‌కు చెందిన అధికారులు, సిబ్బంది స‌ర్కిల్ ప‌రిధిలోని ప‌లు ప్రాంతాల‌కు చెందిన ప్ర‌జ‌ల నుంచి వ‌చ్చిన ఫిర్యాదుల‌ను స్వీక‌రించారు. టౌన్ ప్లానింగ్ సెక్ష‌న్ లో 4 ఫిర్యాదులు రాగా ఇంజినీరింగ్ విభాగంలో 5 మొత్తం క‌లిపి 9 ఫిర్యాదులు ప్ర‌జావాణికి వ‌చ్చాయ‌ని అధికారులు తెలిపారు. స‌ద‌రు ఫిర్యాదుల‌ను వెంట‌నే ప‌రిష్క‌రించాల‌ని డీసీ శ‌శిరేఖ సంబంధిత అధికారులు, సిబ్బందిని ఆదేశించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here