పరిగి నియోజకవర్గాన్ని బీసీలు కైవసం చేసుకోవాలి: బేరి రామచంద్ర యాదవ్

శేరిలింగంప‌ల్లి, న‌వంబ‌ర్ 10 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): పరిగి నియోజకవర్గం డాక్టర్ జగన్మోహన్ ముదిరాజ్ ఆధ్వర్యంలో నిర్వ‌హించిన బీసీ కులాల బీసీ సంఘాల రౌండ్ టేబుల్ సమావేశానికి తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు, పరిగి కాంటెస్ట్ ఎమ్మెల్యే బేరి రామచంద్ర యాదవ్ ముఖ్యఅతిథిగా హాజ‌ర‌య్యారు. ఈ స‌మావేశంలో లాల్ కృష్ణ ప్రసాద్, ఆనంద్ గౌడ్, సదానందం, వెంకటేశం, బీసీ ఫెడరేషన్ అధ్యక్షుడు ఆర్కే సాయన్న ముదిరాజ్, వికారాబాద్ జిల్లా ఐక్యవేదిక అధ్యక్షుడు శంకర్ యాదవ్ పాల్గొని ప్ర‌సంగించారు. ఈ సంద‌ర్బంగా అందరూ ప్రసంగిస్తూ తమ తమ అభిప్రాయాలను, భవిష్యత్తు ప్రణాళికల‌ గురించి పేర్కొన్నారు. మొట్టమొదట జేఏసీ ఏర్పాటు చేయాలని, పరిగి నియోజకవర్గంలోని ఏడు మండలాలు అన్ని గ్రామాలు కమిటీలు ఏర్పాటు చేసి పరిగి నియోజకవర్గాన్ని బీసీలు కైవసం చేసుకునే విధంగా కృషి చేయాలని అన్నారు. లక్ష మందితో బీసీ సమావేశం పరిగిలో ఏర్పాటు చేయాల‌ని చెప్పారు. జేఏసి ఏర్పాటుతో అధికారం ముఖ్యమ‌ని, పరిగిలో బీసీ జెండా ఎగురవేసి ఎమ్మెల్యేగా గెలిపించుకుందాం అని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో సత్యనారాయణ, హనుమంతు ముదిరాజ్, లాల్ కృష్ణ, వికారాబాద్ జిల్లా బిసి కులాల ఐక్యవేదిక అధ్యక్షుడు శంకర్ కురుమ, రాము Yadav అడ్వకేట్ , యాదవ్ సంఘం జిల్లా అధ్యక్షుడు జింకల యాదయ్య యాదవ్, టీచర్ రమేష్ యాదవ్, కంకల్ వెంకటేశం, వెంకటయ్య, హనుమంతు, బీసీ ఎస్సీ ఎస్టీ కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here