- అధికారులకు సహకరించండి
- కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి
చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ డివిజన్ పరిధిలోని వేమనరెడ్డి కాలనీలో కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి పర్యటించారు. కాలనీ వాసులకు కొత్త రెవిన్యూ చట్టం, ధరణి పోర్టల్ పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ కొత్త రెవెన్యూ చట్టం, ధరణి పోర్టల్ తో ఆస్తి తగాదాలకు పరిష్కారంతోపాటు ప్రజలకు ఆస్తిపై హక్కును కల్పించే విధంగా కార్యచరణను తెలంగాణ ప్రభుత్వం రూపొందించిందన్నారు. ఎన్నో ఏండ్లుగా పెండింగ్ లో ఉన్న భూ సమస్యలు ధరణి వల్ల పరిష్కారం అవుతాయని అన్నారు. ప్రజలు తమ ఆస్తులను ధరణి పోర్టల్‌లో నమోదు చేయించుకోవాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ దేశంలోనే నంబర్ వన్ స్థానంలో ఉంచేందుకు కృషి చేస్తున్నారని అన్నారు. కనుక చందానగర్ డివిజన్ లో ఉన్న అందరూ తమ ఆస్తుల వివరాలను ధరణి పోర్టల్ లో నమోదు చేయింకోవాలని సూచించారు. ధరణిలో ఆస్తులను నమోదు చేయించుకునేందుకు ఇంటి నంబర్, ఆధార్ నంబర్, కరెంట్ బిల్ నంబర్, ఫోన్ నంబర్, నామినీ వివరాలు ఉండాలని తెలిపారు.