కొండాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): ప్రతి ఒక్క పట్టభద్రుడు తన ఓటును నమోదు చేసుకోవటమే కాకుండా, తమ కాలనీలలో, బస్తీలలో ఉన్న గ్రాడ్యుయేషన్ చేసిన వారి అందరితోనూ ఎమ్యెల్సీ ఓటును నమోదు చేసుకొనే విధంగా వారికి అవగాహన కల్పించి, వారి ఓటు నమోదుకు సహాయపడాలని పట్టభద్రులకు కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ విజ్ఞప్తి చేశారు. శుక్రవారం రాఘవేంద్ర కాలనీ ఎ, బి బ్లాకు, గోల్డెన్ తులిప్ కాలనీలలో కార్పొరేటర్ హమీద్ పటేల్ పర్యటించి ఆయా కాలనీల అసోసియేన్స్ మెంబర్స్ ను కలిశారు.
మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు పట్టభద్రుల ఎమ్యెల్సీ ఓటరు నమోదు కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టే విధంగా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ప్రతి ఒక్కరూ తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని, ఏ ఎన్నికలలో అయినా తెరాస అభ్యర్థులను ప్రజలు గెలిపించటం ఖాయమని అన్నారు. కార్పొరేటర్ హమీద్ పటేల్ వెంట ఎల్. సదానంద రెడ్డి, నరసింహ రాజు, ఎస్ వి ఎన్ రాజు, ఉషారాణి, సత్యనారాయణ, రవి యాదవ్, గణేష్, యూత్ నాయకులు దీపక్, సంతోష్, రాము ఉన్నారు.