నేతాజీ నగర్‌లో ఇంటింటికీ ఎస్‌ఐఆర్ ఫామ్‌ల పంపిణీ

శేరిలింగంప‌ల్లి, జూలై 9 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): నల్లగండ్ల డివిజన్ పరిధిలోని నేతాజీ నగర్ కాలనీలో గురువారం ఇంటింటికీ బీఎల్‌వోతో కలిసి ఎస్‌ఐఆర్‌ (SIR) ఫామ్‌ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఓటరు నమోదు, వివరాల సవరణ ప్రక్రియలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి ఫామ్‌లను అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకుడు గుర్ల తిరుమలేష్ పాల్గొని ప్రజలకు ఎస్‌ఐఆర్ ఫామ్‌ల ప్రాధాన్యతను వివరించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఫామ్‌లను సక్రమంగా నింపి సంబంధిత అధికారులకు అందజేయాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో బీఎల్‌వోతో పాటు స్థానిక పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here