మాదాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్ డివిజన్ పరిధిలోని భిక్షపతి నగర్ లో స్ట్రామ్ వాటర్ డ్రైన్ పైన కొండాపూర్ ఆర్‌టీఏ అధికారులు వేస్తున్న మట్టి కుప్పలు, రాళ్లను తొలగించాలని కోరుతూ డివిజన్ కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్ మంగళవారం కొండాపూర్ ఆర్టీఏ ఇంచార్జ్ విజయరావుని కలిసి వినతిపత్రాన్ని అందించారు. ఇందుకు స్పందించిన విజయరావు వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బస్తీ అధ్యక్షుడు మహేష్, జంగం, చోటేమియా, కృష్ణ, సత్యనారాయణ, తనాజి, దేవయ్య, శైలజ, లక్ష్మీ, నీలమ్మ, అనిత పాల్గొన్నారు.
