శ్రీ ధ‌ర్మ‌పురి క్షేత్రంలో అల‌రించిన నృత్య ప్ర‌దర్శ‌న‌లు

శేరిలింగంప‌ల్లి, మార్చి 25 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంప‌ల్లిలోని మియాపూర్ శ్రీ ధ‌ర్మ‌పురి క్షేత్రంలో భార‌తీయం స‌త్య‌వాణి ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన సాంస్కృతిక కార్య‌క్ర‌మాలు చూప‌రుల‌ను అల‌రించాయి. ఇందులో భాగంగా నృత్యాన్మ‌య ఫైన్ ఆర్ట్స్ నేతృత్వంలో నృత్య ప్ర‌ద‌ర్శ‌న‌ల‌ను నిర్వ‌హించారు. గ‌త 6 ఏళ్ల నుంచి తాము ఈ సంస్థ ఆధ్వ‌ర్యంలో సంప్రదాయ ప‌రిర‌క్ష‌ణ‌కు కృషి చేస్తున్న‌ట్లు నిర్వాహ‌కులు తెలిపారు. చిన్న‌త‌నం నుంచే సంస్కృతి, సంప్ర‌దాయ‌లు, వార‌స‌త్వంపై అవ‌గాహ‌న క‌ల్పిస్తున్న‌ట్లు తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here